టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ గాయపడింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న రకుల్ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మురుగదాస్ కొద్ది రోజులుగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
హైదరాబాద్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఛేజింగ్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించే పనిలో దర్శకుడు మురుగదాస్ ఫుల్ బిజిబిజీగా ఉన్నాడు. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ షూటింగ్లో రకుల్ ప్రీత్ గాయపడిందని, ఆమె వేలు విరిగిందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రకుల్ స్పందించింది. తన వేలు విరగలేదని, బెణికిందంటూ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తాను కోలుకోవాలంటూ చేసిన అభిమానుల మెసేజ్‌లకు తన ధన్యావాదాలని పేర్కొంది. కాగా, ఈ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.