ఇప్పటికే మళయాళ, కన్నడ బుల్లితెరపై సందడి చేసిన ప్రేమి త్వరలో వెండితెరపై అలరించడానికి రెడీ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోందట. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్థంగా ఉందట. అయితే కరోనా కారణంగా రిలీజ్ లేట్ అవుతోందట.
అయితే ఒక్కో ఎపిసోడ్‌కు లక్ష రూపాయల తీసుకుంటోందట. 2020 వరకూ ఆమెకి అందిన పారితోషికం కోట్లలో ఉందట. ఇటీవల 60 లక్షల రూపాయలు పెట్టి కారు కొందట. ఈమె సొంత ఊరు ఎర్నాకులం. అక్కడ డ్యూప్‌లెక్స్ హౌస్ ఉంది. దీని విలువ 2 కోట్ల వరకు ఉంటుందట. త్రివేండ్రంలో కోటి 50 లక్షలతో ఒక ఫ్లాట్ కొన్నారట. 10 ఎకరాల స్ధలం కూడా ఉందట. ఇలా చెప్పుకుంటే పోతే వంటలక్క బాగానే సంపాదించిందట మరి. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే ఈమె డబ్బులు సంపాదించిందట.