ఇందులో పవన్ మేనరిజం, ఆయన చెప్పిన డైలాగ్స్, ఫైట్స్‌కి ఫిదా కాని ఫ్యాన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రం యువతరం ప్రేమకథలకి, స్టైల్స్‌కి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, సూర్యా మూవీస్ అధినేత ఎం.ఎం.మణిరత్నం శుక్రవారం పవన్ కళ్యాణ్‌ని కలిసి భారీ పుష్పగుచ్చం అందించి తన సంతోషాన్ని పంచుకున్నారు. మణిశర్మ సంగీతం చిత్రాన్ని ఓ రేంజ్‌లో నిలిచేలా చేసింది. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అనే అలనాటి గీతం రీమిక్స్ వర్షెన్ అప్పట్లో సంచలనం సృష్టించింది.