7/G Brindavan Colony team
ప్రముఖ నిర్మాత ఏయం రత్నం నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెండితెరపై ఆవిష్కరించిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ 7/జీ బృందావన్ కాలనీ. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా సంచలన సాధించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులని అలరింబోతుంది. నిర్మాతలు ఉదయ్, యతి ఏయు సినిమాస్ & వివై ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేసిన మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.