భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో సముద్రంలో పడిపోయి ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి టాలీవుడ్‌లో ఆయనతో అనుబంధం ఉన్నవారు తమ సంతాపాన్ని తెలియచేసారు.
సొంత సోదరుడిని కోల్పోయా. ఇంత బాధకు ఎప్పుడూ గురి కాలేదు. నీ సమస్య గురించి కూడా నేను పట్టించుకోవాల్సింది. నీ జీవితానికి నువ్వే ముగింపు పలికి ఉంటావని అనుకోను. నిన్ను మిస్ అయ్యానని ట్విట్టర్ ద్వారా చెప్పాలనిపించింది. ఈ మెసేజ్ పెడుతుంటే కన్నీరు ఆగడం లేదు" అంటూ ట్వీట్ చేశాడు. మరి... చనిపోయిన గోపాల్ రెడ్డి తనయుడి సమస్య ఏమిటో.. విశాల్ చెబితే బాగుండును. ఏది ఏమైనా పోయినవారు తిరిగి రారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం..!