ఆ తర్వాత నమిత మాట్లాడుతూ, వీర్ తనను ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసేందుకు ఏ కారణం దొరకలేదని, ఒకవేళ వీర్ ప్రపోజ్ చేయకపోయి ఉంటే నేనే అతనికి ప్రపోజ్ చేసి ఉండేదానిని అంటూ చెప్పుకొచ్చింది.
ఇక పెళ్లి తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకొచ్చిన బొద్దుగుమ్మ, మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రమే పెళ్లి తర్వాత వచ్చాయని చెప్పింది.