దివ్యాంగుడని ముందే చెప్పలేదు.. ఏడడుగులు వేసే లోపే కనిపెట్టేశారు..

బుధవారం, 6 డిశెంబరు 2017 (09:04 IST)
పెళ్లికుమారుడు దివ్యాంగుడనే విషయాన్ని దాచిపెట్టారు. ఈ విషయం దండలు మార్చుకునే సమయంలోనే వధువు బంధువులు గుర్తించారు. వెంటనే దివ్యాంగుడితో వివాహం రద్దు చేసుకుని 18 గంటల్లోనే మరో సంబంధం వెతికి వధువుకు వివాహం చేసిపెట్టారు.. ఆమె తరపు బంధువులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని నింబాజీలోని ఖోహ్‌కు చెందిన కల్యాణ్ సింగ్ కుమార్తె పింకీకి నారాయణ విహార్‌లోని రైతు కుటుంబానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. వరుడు బంధుసమేతంగా విడిదికి వచ్చాడు. అనంతరం వివాహ తంతులో భాగంగా వధూవరులు దండలు మార్చుకున్నారు. ఇక హోమగుండం చుట్టూ ఏడడుగులు వేయాల్సి ఉంది. ఇంతలో పింకీ తరపు బంధువులు వరుడ్ని దివ్యాంగుడిగా గుర్తించారు. దీంతో వివాహం జరగకూడదని పట్టుబట్టారు. 
 
వరుడు దివ్యాంగుడని ముందే ఎందుకు చెప్పలేదని వరుడు తరపు బంధువులను నిలదీశారు. జీవితాంతం తమ బిడ్డ కష్టాలపాలు కావడం ఇష్టం లేదని చెప్తూ.. పెళ్లిని రద్దు చేశారు. పోలీసుల జోక్యంతో పింకీ బంధువులు 18 గంటల్లోపే మరోక యువకుడ్ని చూసి ఆమెకు వివాహం జరిపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు