Adi Sai Kumar, Miryala, Ashok Reddy Miryala and others
ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అతిధి దేవో భవ. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా నుండి మొదటిపాటగా ఓ ప్రేమ గీతాన్ని విడుదలచేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఆదివారంనాడు అతిధి దేవో భవ చిత్ర విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.