యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా". అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో మ్యూజికల్ హిట్ గా నిలిచి 300 మిలియన్స్ వ్యూస్ సాధించింది. జనవరి 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో యూవీ, జిఏ 2 సంస్థల ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. కాగా ఈ చిత్రం ఫ్రీ- రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో పండగ వాతావరణాన్ని తలపించేలా వైభవంగా జరిగింది.
ఇందులో ప్రత్యేకత ఏమంటే.. సినిమాలలో నటించిన హీరోహీరోయిన్లతోపాటు సాంకేతిక సిబ్బంది మాతృమూర్తులను స్టేజీపైకి పిలిచి గౌరవపూర్వకంగా సన్మానించడం విశేషం. ఇందుకు కారణంలేకపోలేదు. ఈ సినిమాలో జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోసి కనే క్రమంలో పడే మానసిక వేదన, భౌతిక బాధను తెలియజేసే సన్నివేశం వుంది. దానికి తగినట్లు.. `అమ్మ.. అమ్మ మల్లీ నీ కడుపులోనే పుట్టాలమ్మా.. అంటూ ఆధ్రత, ప్రేమను కలగలుపుతూ అనంత్ శ్రీరామ్ రాసిన పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
ఇటీవలే టీజర్తోపాటు ఆ పాటను ప్రదర్శించారు. అది చూసిన వారంతా తమ చిన్నతనంలో తల్లిపడే బాధ, పెద్దయ్యాక మనం తల్లిని ఏవిధంగా చూసుకోవాలనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. తల్లిగా హేమ, కొడుకుగా ప్రదీప్ నటించారు. ఇలాంటి పాత్రకోసం తాను చాలాకాలంగా ఎదురుచూశానని హేమ తెలియజేశారు. క్లయిమాక్స్ మా సినిమాకు బలం అవుతుందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు.