ఖైదీ నంబర్ 150తో రూ.200కోట్ల టార్గెట్.. AMMADU LETS DO KUMMUDU మేకింగ్ వీడియో రిలీజ్ (Video)

గురువారం, 22 డిశెంబరు 2016 (13:15 IST)
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అంతా ఇంతా కాదు. సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత తిరిగి ముఖానికి రంగేసుకున్న చిరంజీవి.. ‘ఖైదీ నంబర్ 150’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా బాక్సాఫీసును బద్ధలు చేయాలని మెగాస్టార్ భావిస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు భారీ కలెక్షన్లను చిరంజీవి లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
మామూలుగా ఇప్పుడు పెద్ద హీరోలంతా రూ. 100 కోట్ల కలెక్షన్లపై గురిపెడితే.. చిరు ఏకంగా దానికి రెండింతలపై కన్నేశాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.  అంటే 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టాలని చిరంజీవి భావిస్తున్నాడు. 
 
ఒక్క తెలుగులోనే 150 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ.50 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు. ఈ కలెక్షన్స్ చిరంజీవికి పెద్ద కష్టమేమీ కాదని ఫిలిమ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
 
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఖైదీ నెం 150 సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల ఖైదీ నెం 150 చిత్రం నుండి విడుదలైన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ నెట్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. దాదాపు మూడు మిలియన్స్‌కి పైగా వ్యూస్ ఈ పాటకి రావడంతో యూనిట్ సభ్యులు ఎగిరి గంతేస్తున్నారు. 
 
తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్‌కి కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్, పాట పాడిన దేవి శ్రీ ప్రసాద్ తమ ఎక్స్ పీరియెన్స్‌ని తెలియజేశారు. ఇక చిత్ర ఆడియోని డిసెంబర్ 25న మార్కెట్ లోకి డైరెక్ట్‌గా విడుదల చేయనుండగా, జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ వేడుక జరపాలని భావిస్తున్నారు. ఈ వేడుక అట్టహాసంగా జరుగుతుందని టాక్ వస్తోంది.

 

వెబ్దునియా పై చదవండి