డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని నాయకా నాయికలుగా `అందమైన లోకం` రూపొందుతోంది. మోహన్ మర్రిపెల్లి దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజ కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కూతురు సహస్ర హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.