ఫస్ట్ లుక్ పోస్టర్‌తో గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రీ-టీజర్‌ను మార్చి14న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ మోడరన్ అవతార్‌లో కనిపించారు. ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్ ల్యాండ్‌స్కేప్ లో డైనమిక్ గా వాక్ చేస్తూ రావడం అదిరిపోయింది. ఈ ప్రీ-టీజర్ లో అఫీషియల్ టీజర్ విడుదల తేదీని కూడా రివిల్ చేస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా అందించారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్