కేసు విచారణ కూడా అంతే సంచలనం అయింది. విచారణ అధికారి సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రావడం, కేసు విచారణ కొనసాగడం తెలిసిందే. అయితే ఇప్పుడీ కేసుకి సంబంధించి కీలక సాక్షి సెయిల్ మరణంతో కలకలం రేగింది.
రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు, ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవిని అప్పట్లో సాక్షిగా పరిగణించింది ఎన్సీబీ. ఆ డిటెక్టివ్ కి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ప్రభాకర్ ని కూడా సాక్షిగా పేర్కొంది ఎన్సీబీ.