అనంతరం విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. శివకి కథపై చాలా పాషన్ వుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేకపోతున్నాను. అంత అద్భుతంగా వుంటుంది. ఈ టీజర్ చాలా సార్లు చూశాను. చూసిన ప్రతిసారి కొత్త కోణం కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ తో సినిమా జరుగుతున్నపుడు ఆయుష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసేవారు. తనని చూసినప్పుడే హీరోలా కనిపించారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీగా చేశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంది. రాధామోహన్ చాలా పాషన్ వున్న నిర్మాత. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. జగపతి బాబు గారు ఎన్నో హిట్స్ చూశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ సినిమాని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.
జగపతి బాబు మాట్లాడుతూ, ఈ సినిమా చాలా స్పెషల్. అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది ఆయుష్ ది ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్. సుశ్రీ పాత్ర కూడా చాలా కీలకంగా వుంటుంది. ఇందులో నేను చాలా డిఫరెంట్ డైమెన్షన్ వున్న పాత్ర చేస్తున్నాను. ఇది నా రెండో హిందీ చిత్రం. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ డైమెన్షన్ వున్న పాత్ర చేస్తున్నాను. మీ అందరిఆదరణ వుంటే తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు.
హీరో ఆయుష్ శర్మ మాట్లాడుతూ, సుల్తాన్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాను. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారే నన్ను నటుడిగా లాంచ్ చేస్తే బావుంటుందని చెప్పారు. అలా నా జర్నీ మొదలైయింది. కెకె రాధమోహన్ గారు బ్రేవ్ హార్ట్ ప్రొడ్యూసర్. ప్యాసన్ కి మారు పేరు. చాలా అంకిత భావంతో ఈ సినిమాని నిర్మించారు. ఆయన బ్యానర్ లో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ గొప్ప విజయాన్ని చేకూర్చుతుందని నమ్ముతున్నాను. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. ఖచితంగా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.
నిర్మాత కెకె రాధమోహన్ మాట్లాడుతూ.. హిందీలో ఇది మా మొదటి సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి అద్భుతంగా తీశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. ఎమోషన్, యాక్షన్, మంచి డైలాగ్స్, అందమైన విజువల్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఏప్రిల్ 26న విడుదలౌతుంది. అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి పెద్ద విజయాన్ని చేకూర్చుతారని నమ్ముతున్నాను.'' అన్నారు. ఈ చిత్రయూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.