సినీ పరిశ్రమ నుంచి వారి వారి కుటుంబ సభ్యుల్లోని వారే ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా క్రికెట్ రంగ కుటుంబం నుంచి ఒక వ్యక్తి తెరగేట్రం చేయనున్నాడు. అతను ఎవరో కాదు ప్రముఖ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అబ్బాస్. ఇప్పటివరకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అబ్బాస్ మొదటిసారి కెమెరా ముందుకు రానున్నాడు. అది కూడా ప్రేమ కథా చిత్రంతో...
తాను సినిమాల్లో నటించడానికి తండ్రి ప్రోత్సాహం కూడా ఉందన్నారు. తెలుగులో మహేష్‌బాబు, కాజల్, అనుష్కలంటే ఎంతో ఇష్టమని చెప్పాడు అబ్బాస్. దర్శకుడు సురేష్‌బాబు మాట్లాడుతూ అజారుద్దీన్ వంటి క్రికెట్ దిగ్గజం కుటుంబంలోని వ్యక్తిని హీరోగా పరిచయం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. చిత్తూరు జిల్లా యాదమర్రికి చెందిన తాను ఈ ప్రాంతంలోనే సినిమా ఘాటింగ్‌ను చేస్తున్నట్లు తెలిపారు.