Akanksha Singh, Divi, Naveen Chandra
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.