అల్లరి నరేష్, అమృత అయ్యర్‌ల అద్భుతమైన బాండింగ్‌ని లిరిసిస్ట్ శ్రీమణి చాలా ఆకర్షణీయంగా అందించారు. లీడ్ పెయిర్ ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ పదాలు వివరిస్తాయి. నరేష్ తన భార్యకు ఏదో ఒక స్పెషల్ ప్రెజెంట్ చేయలాని కోరుకుంటుండగా, ఆమె తన జీవితాంతం అతనితో గడపాలని కోరుకుంటుంది.
ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.
రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
కథ, డైలాగ్స్ సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.
బచ్చల మల్లి ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.