ఎక్స్‌పోజింగ్ చేయడం.. పొట్టి డ్రెస్‌లు వేయాలంటే చిరాకు: నర్గీస్ ఫక్రి

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:31 IST)
పొట్టి పొట్టి డ్రెస్‌లు, బికినీలు, లిప్ లాక్‌లు, హాట్ సీన్లలో ఎంచక్కా నటించేసే బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ.. బికినీలు, పొట్టి డ్రెస్‌లు వేయాలంటే చాలా చిరాకంటూ చెప్పి అందన్నీ నవ్వు తెప్పిస్తుంది. అనతి కాలంలోనే టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్‌గా పేరు కొట్టేసిన నర్గీస్ ఫక్రీ.. హాట్ హాట్ ఫోటో షూట్లు, బికినీలతో యువతకు కైపెక్కించిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఎక్స్‌పోజింగ్ అంటే చిరాకని, చిట్టి పొట్టి బట్టలు వేసుకోవాలంటే చాలా సిగ్గని చెప్పుకొచ్చింది. 
 
శరీరాన్ని అరకొరగా చూపించే దుస్తుల కంటే, శరీరాన్ని కప్పే బట్టలే వేసుకుంటానని నర్గీస్ వెల్లడించింది. ముఖ్యంగా తన బాడీని ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేయడం అస్సలు నచ్చనే నచ్చదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో ప్రేక్షకుల కోసం అలాంటి బట్టలు వేసుకుంటానని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి