ఇప్పుడు టీవీ ప్రొగ్రామ్స్ బాగా ఫాలో అయ్యేవారు జపిస్తున్న.. తపిస్తున్న ప్రొగ్రామ్ బిగ్ బాస్ 3. బిగ్ బాస్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాస్ట్‌గా చేస్తే… బిగ్ బాస్ 2కి నేచురల్ స్టార్ నాని హాస్ట్‌గా వ్యవహరించడం తెలిసిందే. దీంతో బిగ్ బాస్ 3కి హాస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే… బిగ్ బాస్ 3 హోస్ట్ ఇతనే అంటూ నాగార్జున పేరు ఎక్కువుగా వినిపిస్తోంది.
స్టార్ మాటీవీ సోషల్ మీడియా ద్వారా అధికారంతో నడిపే శక్తి గల వ్యక్తి ఎవరు అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. అందులో ఓ స్వామిజీ భక్తులతో మాట్లాడుతూ… మనసు కోతి లాంటిది. అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లో చేరితే..? మమకారంతో.. వెటకారంతో వారిని ఏకతాటి పైకి తెచ్చేది ఎవరు..? అధికారంతో నడిపేది ఎవరు..?
ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తిగల వారు ఎవరు..? అని చెబుతుంటే… ముసుగు వేసుకున్న ఆ వ్యక్తి నడిచి వెళుతుంటాడు. అంతే... బిగ్ బాస్ 3 త్వరలో అని చెప్పారు కానీ.. హోస్ట్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున లేక వేరే హీరోనా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.