స్టార్ మా టీవీ నిర్వహించిన బిగ్ బాస్ 1 ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీనికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాస్ట్‌గా చేయడం అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్’ సీజన్-2 ఆదివారం నుంచి ప్రసారం కాబోతోంది.
తాజా సమాచారం ప్రకారం... ఇందులో గీతామాధురి, అమిత్ తివారి, టివీ 9 యాంకర్ దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను, రోల్ రిదా, యాంకర్ శ్యామల, కిరిటి ధమరాజు, దీప్తి సునాయన, కౌశల్, తేజస్వి, సమ్రాట్, గణేష్ (కామన్ పీపుల్) సంజన (కామన్ పీపుల్) నూతన్ నాయుడు (కామన్ పీపుల్) పాల్గొంటున్నారు.