బిగ్ బాస్ మూడో సీజన్‌లో దొంగలు దోచిన నగరం టాస్క్ హింసాత్మకంగా మారింది. ఈ టాస్క్‌లో దొంగలకు రాణిగా శిల్పా ఉండగా, దొంగలుగా రాహుల్, రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్, పునర్నవి సందేశ్ ఉన్నారు.
నగర వాసులుగా శ్రీముఖి, హిమజ, అలీ, వితికా, మహేష్, బాబా భాస్కర్ ఉంటారని బిగ్ బాస్ తెలిపారు. మొదటి లెవల్ మంగళవారం జరగగా ఈ లెవల్‌లో ఇంటి సభ్యులు వీరంగం సృష్టించారు.
బుధవారం ఇంటిసభ్యులు రచ్చ చేశారు. టాస్క్‌లో భాగంగా రంగంలోకి దిగిన ఇంటి సభ్యులు తాము సెలబ్రిటీలమన్న విషయమే మరచిపోయి వీరంగం సృష్టించారు. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, గింజుకోవడాలు ఇలా హింసాత్మకంగా టాస్క్ చేశారు. బిగ్ బాస్ మంగళవారం రోజు వార్నింగ్ ఇచ్చినప్పటికి అవేమి పట్టించుకోని హౌజ్‌మేట్స్ బుధవారం రోజు కూడా బీభత్సం సృష్టించారు. టాస్క్ మరింత హింసాత్మకంగా మారుతున్న తరుణంలో బిగ్ బాస్ 'దొంగలు దోచిన నగరం' టాస్క్‌ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
అలాగే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ఏడవ వారం లగ్జరీ బడ్జెట్ టాస్ రచ్చ రచ్చ అయ్యింది. శిల్ప చక్రవర్తి ప్రాణాల మీదుకు వచ్చింది. ఆమెను కాపాడే క్రమంలో ఆమెను లాగే ప్రకమంలో ఆమెకు అపాయం ఏర్పడింది. దాంతో బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను క్యాన్సిల్ చేయడం జరిగింది. టాస్క్‌లో ఎక్కువ హింస జరగడంతో టాస్క్‌ను నిలిపేసినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు. టాస్క్ రద్దు కావడంకు ప్రధాన కారణం అయిన ఇద్దరిని జైల్లో ఉంచడంతో పాటు వారికి కఠని శిక్ష అమలు చేయడం జరిగింది.
వరుణ్ కెప్టెన్‌గా ఉండటంతో ఆయన్ను ఎవరి వల్ల ఈ టాస్క్ ఆగిపోయిందో నిర్ధరించాలంటూ ఆదేశించాడు. అప్పుడు ఓటింగ్ పక్రియ ద్వారా ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. రాహుల్‌కు ఎక్కువ మంది ఓట్లు వేయగా రవికి అయిదు, అలీకి నాలుగు ఓట్లు పడ్డాయి. దాంతో రాహుల్ మరియు రవిలకు జైలు శిక్ష పడింది. జైల్లో వారికి ఆహారం ఇవ్వకుండా ఉంచాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. జైల్లో ఖైదీలు తాగే అంబలిని రాహుల్ మరియు రవిలు తిన్నారు.