తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్(మా)లో సభ్యత్వ రుసుము చెల్లించారు. గతంలో తాను సభ్యత్వ రుసుము ఇవ్వలేదన్న ప్రచారం సరికాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలకవర్గం సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై పోరాటం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ఫిలించాంబర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.