మ్యూజికల్ సక్సెస్ చాలా రేర్ గా వస్తుంది. అల వైకుంఠపురం మూవీలో అన్ని సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి, అందుకు ప్రధాన కారణమైన త్రివిక్రమ్, అల్లు అర్జున్ లకు కృతజ్ఞతలు. ఆ సినిమా తరువాత సోలో బతుకే సో బెటర్, క్రాక్ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన సాంగ్స్ చేశాను అప్పటినుండి కళ్యాణ్ గారితో అనుబంధం ఏర్పడింది. గబ్బర్ సింగ్ సినిమా నేను మిస్ అయ్యాను. ఇప్పుడు వకీల్ సాబ్ తో సెట్ అయింది`` అని సంగీత దర్శకుడు థమన్ అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీడియాతో మాట్లాడారు.