త్రిష కూడా పాల్గొన్న ఈ పాటలో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. సోషియో ఫాంటసీ కథగా రూపొందుతోన్న విశ్వంభర లో భక్తికూడా జోడించారు. నిన్న, నేను కూడా భక్తి గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. 'రామ రామ జయరామ జయ సీతారామ' అనే పాటను శోభుమాస్టర్ కొరియోగఫ్రీలో తెరకెక్కిస్తున్నారు. కాగా, శుక్రవారంనాడు ఈ పాటలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
విశేషం ఏమంటే, సాయిధరమ్ తేజ్, నిహారిక కొణిదెల కూడా ఈ పాటలో జాయిన్ కావడం విశేషం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరూ ఓ వేడుకకు ఆహ్వానం నిమిత్తం రావడం అక్కడ ఈ పాట రావడం జరుగుతుందట. ఇది తెరపై మరింత ఆకర్షణీయంగా వుంటుందని మెగా అభిమానులకు ఫీస్ట్ లా వుంటుందని చిత్ర యూఁట్ చెబుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ బేనర్ పై ఈ సిఁమా ఁర్మాణం జరుగుతోంది. మరిన్ని తాజా వివరాలు త్వరలో తెలియనున్నాయి.