అలీకి నోటి దూలొక్కటే ఎక్కువ కాదు.. దానం చేసే గుణం కూడా ఉందండోయ్

శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (16:45 IST)
టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ అంటే అందరికి బాగా తెలుసు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసి అతి చిన్నవయసులోనే మంచి కామెడీతో మన అందరిని బాగా నవ్వించాడు. ఆ తర్వాత హీరోగా కొన్ని సూపర్ హిట్స్ కొట్టినపటికి కూడా ఆ తర్వాత హీరోగా తన కెరీర్ ని అంత గొప్పగా రానించుకోలేకపోయాడు. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోనే కమెడియన్‌గా మారి అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నాడు. 
 
ఇప్పుడు అలీ సినిమాలతో పాటు బుల్లి తెర మీద కూడా కనిపిస్తున్నాడు కూడా. అవార్డు వేడుకలతో పాటు, ఇతర స్టేజ్‌ షోలపై తనదైన మార్క్‌ వేసిన అలీకు అడల్డ్ జోక్‌లు వేయటం, అది ప్రతీసారి వార్తల్లో నిలవటం సర్వసాధారణమైపోయింది. అయితే ఆయన అడల్ట్ జోక్స్‌ని ఇండస్ట్రీ పెద్దలు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ప్రతీ ఫంక్షన్‌లోనూ, ఎంతటి వారు ఉన్నా అలీ తన నోటి దూలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 
 
ఈయన సినిమాల్లో కూడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, బూతు పదాలు వాడుతూ ఉంటాడు. దాంతో ఈయనపై పెద్దలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో ఈయన కామెడీ కంటే కొంతమంది ఈయన బూతునే ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ మాత్రం ఈయన బూతులను తట్టుకోలేక చెవులు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. అంతటి బూతు కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అలీలో మరో యాంగిల్‌ కూడా ఉంది. 
 
ముస్లీం అయిన అలీలో మంచి మనసు కూడా ఉంది. అలీ ప్రతి సంవత్సరం రంజాన్‌ ఉపవాసాల సమయంలో అనాథలైన వంద మందికి ఇఫ్తార్‌ వింధు ఇస్తాడట. అనాథలకు ఒక్కరికి ఇద్దరికి అన్నం పెట్టడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో అలీ ఏకంగా వంద మందికి ఇఫ్తార్‌ విందు ఇచ్చి తనలోని మానవతాదృక్పథం చాటుతున్నాడు. ఇక ప్రతి సంవత్సరం తన సంపాదనలో ఎంతో కొంత స్వచ్చంద సంస్థలకు దానం ఇస్తాడట. ఈ విషయాన్ని ఆయన పలు సార్లు స్వయంగా పేర్కొన్నాడు. నిజంగా అలీ గ్రేట్ సుమా..! 
 
 

వెబ్దునియా పై చదవండి