మురళీ మోహన్ ఇంట్లో కరోనా కలకలం.. సెల్ఫ్ క్వారంటైన్‌లో వున్నారట..

బుధవారం, 10 జూన్ 2020 (12:04 IST)
Murali Mohan
టాలీవుడ్ సీనియర్ హీరో మాజీ తెలుగుదేశం ఎంపీ మురళీ మోహన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మురళీ మోహన్ కుమారుడి ఇంట్లో పనిచేస్తోన్న ముగ్గురు మనుషులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. అందులో ఇద్దరు భార్యాభర్తలు కాగా.. మరొకరు వంట మనిషి అని చెబుతున్నారు. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్దుడికి, బంజారా హిల్స్‌లో రోడ్ నెం. 14లో ఉన్న మరో యువతికి కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
వీళ్ల ద్వారా మురళీ మోహన్ ఇంట్లో పనిచేసే వాళ్లకు కరోనా వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మురళీ మోహన్ కొడుకు, కోడలితో పాటు పలువురు కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి రెడీ అయ్యారు. 
 
అప్పటి వరకు ఎందుకైనా మంచిదని మురళీ మోహన్ ఇంట్లో పనివాళ్లకు సెలవు ఇచ్చి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం మురళీ మోహన్ కొడుకుతో కాకుండా విడిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన రాజకీయాలు పక్కనపెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు