తమిళనాడులో కరోనా సోకి తొలి ప్రజా ప్రతినిధి అన్భళగన్ మృతి

బుధవారం, 10 జూన్ 2020 (09:51 IST)
Anbazhagan
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న కరోనా వైరస్ కారణంగా లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా కరోనా వైరస్ సామాన్య ప్రజలను కాకుండా అన్నీ వర్గాల ప్రజలను కబళిస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జే అన్భళగన్ (61) కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. 
 
కొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ని మంగళవారం ఆస్పత్రిలో చేర్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలోల చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
తద్వారా భారత్‌లో కరోనా వైరస్ సోకి మరణించిన తొలి ప్రజా ప్రతినిధి ఆయనే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక అన్భళగన్ మృతి పట్ల డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు