రామ్‌చరణ్ ఖాతాలో మరో ఫట్ పడినట్లేనా? ధృవ కూడా ఆశించిన స్థాయిలో చెర్రీకి గుర్తింపు సంపాదించిపెట్టలేదా? అనే ప్రశ్నలకు టాలీవుడ్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ధృవ కోసం చరణ్ చాలా శ్రమించాడు. చరణ్‌తో బాటు అరవింద్ స్వామి కూడా ఆడియెన్స్‌ని తమ నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఇది రీ-మేక్ సినిమా అన్న ముద్ర పడిపోయింది. తమిళంలో ఒరిజినల్ చిత్రం తని ఒరువన్ చూసినవాళ్ళు ధృవ చూసి పెదవి విరుస్తున్నారు. పాటలు పేలవంగా ఉన్నాయని చెప్తున్నారు.
కేవలం హీరో, విలన్ లకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఇతర పాత్రలను పక్కనబెట్టేశారని టాక్ వస్తోంది. అయితే చెర్రీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ. బ్రూస్ లీ చిత్రం తరువాత ఇన్నాళ్ళకు తమ అభిమాన హీరో సినిమా చూడగలిగామని ఫుల్ జోష్‌లో ఉన్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా తెరపైకి రానుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.