వైద్య ప్రపంచలో చికిత్సలేని వ్యాధి బారినపడిన హాలీవుడ్ నటుడు

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (11:00 IST)
హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లిస్ (67) వైద్య ప్రపంచంలో చికిత్సంటూ లేని వ్యాధిబారినపడ్డారు. ఫ్రాంటో‌టెంపోరల్ డిమోన్షియా అనే వ్యాధికి ఆయన గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన గత యేడాది రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెల్సిందే.
 
ఈ వ్యాధి సోకినే మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్లు పేరుకోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు జెబుతున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్, టెంపోరల్‌ భాగాలు క్రమంగా కుంచించుకునిపోవడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి ముదిరేకొద్దీ, రోగి ప్రవర్తనలో మార్పులు రావడంతో చిరాకు, కోపం, భాషాపరమైన సమస్యలు తలెత్తడం, నడకలో సమతౌల్యం కోల్పోవడం వంటి ఇతర మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. 
 
"అయితే, ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నారని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం" అని బ్రూస్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. "డై హార్ట్" సినిమాలతో బ్రూస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మూన్‌లైటింగ్ అనే టీవీ షో ద్వారా ఆయన తొలిసారి ప్రజల దృష్టిలో పడ్డారు. తన కెరీర్‌లో బ్రూస్ ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, రెండు ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు