మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా 'స్వప్నాల నావ' రూపొందింది. డల్లాస్ కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి శ్రీ గోపీకృష్ణ కొటారు గారు 'శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా 'స్వప్నాల నావ' ని రూపొందించడం జరిగింది. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి.