తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటీమణులు డిస్కో శాంతి, లలిత కుమారిల మేనకోడలు అబ్రిన (17) అదృశ్యం ఇపుడు కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం అబ్రిన అదృశ్యం కాగా, ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో అబ్రిన తల్లి సెరిల్, మేనత్త డిస్కోశాంతి (ప్రకాశ్ రాజ్ మొదటి భార్య) మీడియా ముందుకు వచ్చారు.
చైన్నైలోని టీనగర్లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్ మొళివర్మన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె అబ్రిన నగరంలోని చర్చ్ పార్క్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది. ఈ నెల 6వ తేదీన స్కూల్‌కు వెల్లిన అబ్రిన.. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు.
ఆ యువతి కోసం బంధువులు, స్నేహితులు, చైన్నైలోని వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు పాండీ బజార్ పోలీసులను ఆశ్రయించారు. కానీ, అపర్ణ అదృశ్యమై వారం రోజులైనా ఆచూకీ లభించక పోవడంతో వారు కంగారు పడుతున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికే అబ్రిన చదువుతున్న చర్చ్ పార్క్ స్కూల్లో విచారించారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్‌ను పరిశీలించారు. అయినా, ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.