హైద‌రాబాద్‌లో వేసిన సెట్లో దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం

శుక్రవారం, 1 జులై 2022 (17:01 IST)
Dsara nani look
నేచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న 'దసరా' షూటింగ్‌ ను పునఃప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు. దీనికోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశారు.
 
ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో కనిపించనున్నారు. నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది.
 
తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో నాని లుంగీ, బనియన్‌లలో మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. కోల్ మైన్ పై నిలబడి బీడీ తాగుతున్న లుక్ ఫుల్ మాసీగా వుంది.
నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కనిపించనుంది.
 
ఈ చిత్రం గత షెడ్యూల్‌లో షూటింగ్ స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అంతకు ముందు నాని, కీర్తి సురేష్‌లపై ఓ భారీ పాట చిత్రీకరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట కొరియోగ్రఫీ అందించి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు.
ఇప్పటికే విడుదలైన 'దసరా' గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.
 
సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.
తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు