హృదయాన్ని కదిలించే అందమైన మెలోడీగా దావ్జాంద్ ఈ పాటని స్కోర్ చేశారు. బీట్లు ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్‌తో ట్రెండీగా ఉన్నాయి. ఫారిన్ లొకేషన్లలో అద్భుతంగా చిత్రీకరించబడిన ఈ రొమాంటిక్ నంబర్‌కు కృష్ణకాంత్ సాహిత్యం రాశారు. కపిల్ కపిలన్, లిన్ తమ మెస్మరైజ్ వాయిస్ తో పాటకు అదనపు ఆకర్షణను జోడించారు.
రవితేజ, కావ్యా థాపర్ల కెమిస్ట్రీ పాటకు మరింత ఆకర్షణనిచ్చింది. థియేటర్లలో పూర్తి పాటను చూసినప్పుడు ఇది మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. మీ అందరి ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈగల్ డిఫరెంట్ మ్యాసీ ఫిలిం. ఎంటర్ టైమెంట్ అద్భుతంగా వుంటుంది. మీ అందరికీ తెగ నచ్చుతుంది. నాకు విపరీతంగా నచ్చింది. జనవరి 13న అందరూ థియేటర్స్ కి వచ్చేయండి. గోలగోల చేద్దాం'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవ్ జాంద్ మాట్లాడుతూ ..రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కాలేజీ డేస్ లో వెంకీ సినిమా ఎనిమిదిసార్లు చూశాను. ఇప్పుడు ఆయన సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం అనేది కల నెరవేరినట్లయింది. రవితేజ గారికి, డైరెక్టర్ కార్తిక్ కి, నిర్మాత విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు'' తెలిపారు. ఈ వేడుకలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.