నీ క్యాస్ట్ ఏంటి? ఇదో డేంజరస్ సీక్రెట్ "#EvvarikeeCheppoddu" (వీడియో)

గురువారం, 3 అక్టోబరు 2019 (17:47 IST)
''ఎవ్వరికీ చెప్పొద్దు'' సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ హిట్ కొట్టడం ఖాయమనేలా వుంది. ప్రేమ కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ట్రైలర్‌లో హీరోహీరోయిన్ల మధ్య ఆకట్టుకునే డైలాగులున్నాయి. ''ఎవ్వరికీ చెప్పొద్దు'' అనే పదాల్ని ట్రైలర్ మొత్తం తెగవాడేస్తున్నారు. అలాగే బసవ శంకర్ దర్శకత్వంలో ఈ 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమా రూపొందుతోంది. 
 
రాకేశ్, గార్గేయి ఈ సినిమాలో నాయకా నాయికలుగా కనిపించనున్నారు. హీరోగా చేస్తోన్న రాకేశ్ ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. వరికి వారు తమకి తెలిసిన సీక్రెట్ ను మరొకరితో చెప్పి, 'ఎవ్వరికీ చెప్పొద్దు' అంటూ వుంటారు. 
 
ఇంకా హీరోయిన్ హీరోను ''మీ క్యాస్ట్ ఏంటి? అనే డైలాగ్, ట్రైలర్ చివర్లో బాబూ మీరు ఏంటోళ్లు అంటూ ఓ వ్యక్తి హీరోను అడగటం పైన ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఇంకేముంది.. ఎవ్వరికీ చెప్పొద్దు.. అంటూ అక్టోబర్ 8వ తేదీన వచ్చేస్తున్న ఆ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు