ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పరిధిలోని కామలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియుడితో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఆమె ఆకస్మిక మరణంతో దిగ్భ్రాంతికి గురైన యువకుడు ఆమెను కోల్పోయానన్న బాధను తట్టుకోలేకపోయాడు. మద్యం తాగి ఆమె అంత్యక్రియలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు.
వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కన్హాన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.