అదేసమయంలో పెను వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా, తమిళనాడులోని అధికార మాజీ ముఖ్యమంత్రి జయలలితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించింది. దీంతో అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. ఫలితంగా ఈ చిత్రాన్ని రీ సెన్సార్ చేసి, వివాదాస్పద డైలాగులు, సన్నివేశాలను తొలగించారు.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే శ్రేణులు పాల్పడిన చర్యలపై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా 'సపోర్ట్ విజయ్' అనే హ్యాష్‌టాగ్‌తో తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. కొందరు అభిమానులు తమ ఇంట్లో ఉన్న ఉచిత మిక్సీ, గ్రైండర్లను పగలగొడుతూ వినూత్న నిరసనకు దిగుతున్నారు.