తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు దాటిపోతోంది. ఇప్పటికే అభిమానుల చేష్టలతో రజనీపై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయి. తాజాగా అభిమానులు పోస్ట్ చేసిన ఓ ఫోటో జాతిపిత మహాత్మాగాంధీని కూడా వివాదాల్లోకి లాగే పరిస్థితి ఏర్పడింది.
1948లో మరణించిన జాతిపిత మహాత్మా గాంధీని 1950లో పుట్టిన రజనీకాంత్ కలవడమేంటి? నిజమా అనుకుంటున్నారా? నిజమేనండి. జాతిపితతో రజనీ కాంత్ మాట్లాడుతున్నట్లు గల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు ఎదుర్కొంటోంది. మహాత్ముడితో సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతున్నట్టున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.