ఈ చిత్ర కథప్రకారం ఇద్దరు హీరోయిన్లు కావాలని తెలుస్తోంది. ఒకరు గ్లామర్, మరొకరు సాంప్రదాయం లుక్ వున్న హీరోయిన్లు కావాలట. ఇందుకు ఇటీవలే నలుగురుని అనుకున్నారు. అందులో ఇద్దరిని ఫైనల్ చేయవచ్చని సమాచారం. వారిలో పూజా హెగ్డే, రష్మికా మందన్నా వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ నటించిన “బీస్ట్” రిలీజ్ కి రెడీగా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. లక్కీ హీరోయిన్గా రష్మికా మందన్నాను తెలుగు పరిశ్రమ చూస్తోంది. కనుక వీరిద్దరు ఖన్ఫార్మ్ అయ్యారనే అనిపిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.