ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్

శనివారం, 24 నవంబరు 2018 (11:10 IST)
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రతి కథానాయకుడుగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న వారిలో హరీశ్ ఉత్తమన్ ఒకరు. ఈయన తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పాడు. అదేసమయంలో ఆయన ఇటీవల తన ప్రియురాలు అమృతా కళ్యాణపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
 
వీరి వివాహం కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ ఆలయంలో అతిసాదాసీదాగా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది. నిజానికి వీరిద్దరూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. చివరకు ఈనెల 6వ తేదీన ఒక్కటయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు