ఫేస్‌బుక్‌లో మైనర్ బాలికను వేలం వేశారు.. పెళ్లి కూడా చేసేశారు..

గురువారం, 22 నవంబరు 2018 (17:48 IST)
స్త్రీల రక్షణ కోసం ఎన్నెన్ని ఉద్యమాలు వస్తున్నా.. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా పదహారేళ్ల మైనర్ బాలికను ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా వేలం వేశారు. ఈ వేలంలో ఆ బాలికను పాడుకున్న వ్యక్తితో పెళ్లి చేశారు. 
 
ఈ ఘటన దక్షిణ సూడాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ సూడాన్‌లోని ఓ వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకునేందుకు డబ్బు చెల్లించమని చెప్తున్న వీడియో ఫేస్‌బుక్‌లో అక్టోబర్ 25వ తేదీ నుంచి వైరల్ అవుతోంది. 
 
కానీ ఈ వీడియోను ఆలస్యంగా గమనించిన ఫేస్‌బుక్ యాజమాన్యం.. నవంబర్ 9న ఆ యూజర్ ఐడీని బ్లాక్ చేసి వీడియోను తొలగించింది. కానీ ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫేస్‌బుత్‌లో అమానవీయతను, అన్యాయాన్ని ప్రదర్శించే చర్యలను అనుమతించేది లేదని ఫేస్‌బుక్ ప్రతినిధి జుకర్ బర్గ్ తెలిపారు. 
 
తమ కంపెనీ పాలసీలను ధిక్కరింటే పోస్టులను గుర్తించేందుకు 30వేల మంది ఉద్యోగులను నియమించినట్లు చెప్పారు. కానీ వేలంపాటలో బాలికను ఓ వ్యక్తిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. నవంబర్ మూడో తేదీన అతను బాలికను పెళ్లి చేసుకున్నాడు. సూడాన్‌లో బాల్య వివాహాలు, వరకట్నవేధింపులు ఎక్కువ అన్నారు.
 
కాగా మైనర్ బాలికను వేలం వేయడం ద్వారా ఆమె తండ్రికి 500 గోవులు, రెండు లగ్జరీ కార్లు, రెండు బైకులు, ఒక పడవ, కొన్ని మొబైల్ ఫోన్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు