బిగ్ బాస్-2 హౌస్‌లోకి హెబ్బాపటేల్ ఎంట్రీ.. క్లారిటీ వచ్చేసింది..

బుధవారం, 18 జులై 2018 (15:11 IST)
బిగ్ బాస్ సీజన్ 2కి గ్లామర్ రానుంది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ తెలుగు ప్రారంభమై ఐదు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఐదో వారంలో భానుశ్రీ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. 
 
దీంతో భానుశ్రీ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-1లో నవదీప్, దీక్షా పంత్‌లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఇదే తరహాలో నాని బిగ్ బాస్-2లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హెబ్బా పటేల్ రానుందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ వార్తలపై హెబ్బా పటేల్ క్లారిటీ ఇచ్చింది. ''నేను మా ఇంట్లోనే వున్నానని.. మరే ఇంట్లోనూ లేను.. ఏ రియాల్టీ షోలోనూ పాల్గొనడం లేదు''... అంటూ స్పష్టం చేసింది. తద్వారా 'బిగ్ బాస్ హౌస్'లోకి హెబ్బా పటేల్ ఎంట్రీ ఇచ్చేదిలేదని తేలిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు