టాలీవుడ్ మహిళా కార్మికులకు కమెడియన్ అలీ దంపతుల సాయం

సోమవారం, 24 మే 2021 (16:30 IST)
కరోనా సెకండ్ వేవ్‌తో తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ స్తంభించిపోయింది. దాంతో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ కమెడియన్ అలీ, జుబేదా దంపతులు టాలీవుడ్ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, చక్కెర, మరో 8 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తం రూ.2 లక్షల వ్యయంతో 130 మందికి సాయం చేసినట్టు అలీ తెలిపారు.
 
ఈ మహిళా కార్మికులు తమకంటే ముందే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారని, తాము తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను కూడా శుభ్రం చేస్తుంటారని వివరించారు. కరోనా కారణంగా పని లేక వారు ఇబ్బంది పడుతుంటే తన వంతుగా స్పందించానని అలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు ఖయ్యూం తదితరులు కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు