భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

ఠాగూర్

సోమవారం, 5 మే 2025 (23:27 IST)
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న ప్రస్తుతం పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ సౌరభౌమత్వానికి లేదా ప్రాదేశిక సమగ్రతకు ఎలాంటి ముప్పు ఎలాంటి ముప్పు వాటిల్లినా పూర్తిస్థాయి సైనిక శక్తితో బదులిస్తామని హెచ్చరించారు. 
 
రావల్పిండిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, 'పాకిస్థాన్ ఎక్కడైనా శాంతికి కోరుకుంటుందన్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ సారభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే, దేశ జాతీయ ప్రతిష్టను, ప్రజల శ్రేయస్సును కాపాడుకోవడానికి పాకిస్థాన్ పూర్తి బలంతో ప్రతిస్పందిస్తుంది' అని ఆయన హెచ్చరించారు. 
 
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఇస్లామాబాద్ ప్రోత్సహిస్తుందని భారత్ తీవ్రంగా ఆరోపిస్తుంది. దీనికి ప్రతిగా దౌత్య సంబంధాలను తగ్గించుకోవడం, కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, ప్రధాన రహదారి సరిహద్దులను మూసివేయడం వంటి చర్యలను భారత్ చేపట్టింది. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత భారత్ తమపై సైనిక చర్యకు సిద్ధమవుతోందని తమ వద్ద విశ్వసనీయమైన నిఘా సమాచారం ఉందని పాకిస్తాన్ అంతకుముందు ఆరోపణలు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు