హైపర్ ఆదికి ముద్దుపెట్టబోయిన శ్రద్ధాదాస్..

శనివారం, 6 ఆగస్టు 2022 (22:40 IST)
జబర్దస్త్ నుంచి తప్పకున్నాక కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ 14 లాంటి షో లలో మాత్రం కనిపిస్తూనే ఉంటారు ఆది. హైపర్ ఆదికి అందరూ షాకయ్యేలా పంచులు వేస్తాడు అనే పేరు ఉంది.
 
ఆయన పంచ్ వేస్తే దానికి కౌంటర్ వేయడానికి కూడా అవతలి వాళ్ళు ఆలోచించే స్థాయిలో ఆయన పంచులు ఉంటాయి. అయితే ఎక్కువగా అమ్మాయిలతో రొమాంటిక్ యాంగిల్‌లో పంచులు వేస్తూ ఉండే హైపర్ ఆది తాజాగా శ్రద్దా దాస్‌తో పులిహోర కలవడానికి ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. 
 
నిజానికి కాస్త ఫేమ్ తగ్గింది అనుకుంటున్న హీరోయిన్లు ఇప్పుడు టీవీ షోలలో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రియమణి గతంలో ఢీ షోకి జడ్జిగా వ్యవహరించింది.
 
ఇప్పుడు ఆమె స్థానంలో నందితా శ్వేత, అలాగే శ్రద్ధాదాస్ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ 14కి సంబంధించిన ప్రోమో విడుదలవగా ఆ ప్రోమోలోనే హైపర్ ఆది శ్రద్ధాదాస్‌తో పులిహోర కలపడానికి ప్రయత్నించి ఆసక్తి రేకెత్తించాడు. 
 
అసలు విషయం ఏమిటంటే ఢీ-14లో భాగంగా ఒక బాలుడు అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడంతో అతనికి ముద్దు ఇవ్వడానికి శ్రద్ధాదాస్ తన సీటు దగ్గరికి పిలుస్తుంది. అక్కడికి వెళ్లిన ఆ బాలుడు శ్రద్ధా దాస్‌కి ముద్దు పెట్టి వస్తాడు.
 
అయితే అతనిని చూసి మిగతా వాళ్ళు కూడా తమకు ముద్దు పెట్టాలంటూ ఆమె దగ్గరికి వెళతారు. కానీ ఆమె హైపర్ ఆదికి తప్ప ఇంకెవరికి ముద్దు పెట్టను అని అంటుంది. అలా వెళ్ళిన తర్వాత హైపర్ ఆది ముద్దు వద్దు హగ్గు కావాలని అడగడంతో హగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. 
 
కానీ షోలో హైపర్ ఆది భార్యగా యాక్ట్ చేస్తున్న తేజస్వి బెహరా మాత్రం అందుకు ఒప్పుకోనట్లు అడ్డం పడుతుంది. అలా సరదా సరదాగా సాగిపోతున్న ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు