ఈ నేపథ్యంలో బాక్స్ క్రికెట్ లీగ్ ప్రొప్రైటర్, కమ్మర్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత కమర్ మాట్లాడుతూ... ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ విలువలతో మంచి సినిమా కంటెంట్లను ప్రోత్సహించడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నిర్మాణంలో జరిగే సినిమాలను ఓటిటి ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మళియాలంలో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని తన కోరికను బయటపెట్టారు. ఫ్యాషన్ టీవీ ఇండియా, బాక్స్ క్రికెట్ లీగ్, ఫిల్మ్ ఫేయిర్ లాంటిసంస్థలను దిగ్విజయంగా నడుపుతూ.. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నా కమర్ ఫిలమ్ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. త్వరలోనే సినిమా నిర్మాణ పనులు కూడా ప్రారంభం చేస్తున్నట్లు అందుకోసం వర్థమాన ఫిల్మ్ మేకర్స్ తో సంభాషిస్తున్నట్లు తెలిపారు.