నేను ఎం.టెక్. కంప్యూటర్ డిగ్రీ కోసం యు.కె. వెళ్ళాను. టెక్నాలజీని అప్‌గ్రేడ్ కోసం. ఏడాది కోర్సు అది. అక్కడకు వెళ్ళగానే కోవిడ్ సోకింది. యు.కె.లో కోవిడ్ శాతం చాలా తక్కువ. మేముండే కాలనీలో కూడా పెద్దగా లేవు. విషయం తెలిసిన నా భర్త, నీలిమాకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేశాడు. అది తెలుసుకున్న యు.కె.లో చాలామంది మేం వున్నాం. ధైర్యంగా వుండమని ధైర్యం నూరిపోశారు. మా కాలనీలో కూడా సపోర్ట్ చేశారు. అయితే నేను ఇక్కడ ఒక్కదానినే వున్నా. ఎలాగైనా ఇండియా వెళ్ళాలని అనుకున్నా. అప్పటికే కరోనా సెకండ్‌వేవ్ ఇండియాలో బాగా వుంది. యు.కె.లో ఆసుపత్రికి ఫోన్ చేశాను. వెంటనే డాక్టర్, నర్సు వచ్చారు. అన్ని టెస్ట్‌లు ఇంటివద్దే చేశారు. బ్రీతింగ్ సమస్య అని చెప్పా. మీకు కరోనా లక్షణాలు ఎక్కువగా లేవు. కాబట్టి పారాసిటమాల్ వేసుకోండని వారంరోజులకు రాసి ఇచ్చారు. 6 రోజులక నెగెటివ్ లక్షణాలు వచ్చాయి అంటూ వివరించింది.
ఇదే విషయమై కౌశల్ మాట్లాడుతూ, యు.కె.లో కాల్ చేయగానే అంబులెన్స్‌తో డాక్టర్ వచ్చి అన్ని పరీక్షలు చేశారు. మనలోని రోగనిరోధకశక్తి మన బాడీలోనే వుంటుంది. అదే సెట్ చేసుకుంటుంది. కాబట్టి ఓపిగ్గా మేం చెప్పినట్లు పారాజిటమాల్ మాత్రమే వేసుకోమని డాక్టర్ చెప్పారు. ఇది మా నీలిమాకు నచ్చలేదు. అదే ఇండియాలో అయితే రకరకాల టెస్ట్‌లుచేసి వెంటనే ఆసుప్రతిలో జాయిన్ చేసుకుని పెద్ద పెద్ద ట్రీట్‌మెంట్ ఇస్తేగానీ ట్రీట్‌మెంట్ చేసినట్లుకాదు. ఇదే విషయం మా బంధువులు, స్నేహితులు కూడా రకరకాల జాగ్రత్తలు చెప్పడంతో నీలిమ కంగారు పడింది. ఏదిఏమైనా యు.కె.లో అవసరం వుంటేనే పేషెంట్‌ను ఆసుప్రతిలో జాయిన్ చేసుకుంటారు. ఇది నిజంగా చాలా గొప్పవిషయం. నిజంగా యు.కె. ట్రీట్‌మెంట్ చాలా గొప్పది. ఇక ఇండియాలో కోవిడ్ అనగానే తెలిసినవారు రకరకాలుగా ఏవేవో చెబుతారు. దానికి మనం భయపడిపోయి ఏదేదో చేస్తాం. చిరికి ఏమవుతుందో చూస్తూనే వున్నాం కదా.. అంటూ యు.కె. ఇండియా పేషెంట్ విషయంలో డాక్టర్లు ఎలా రియాక్ట్ అవుతారో కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. ఇలా ఇండియా ఎప్పటికి తయారువుతుందో మరి.