తాజాగా మెహందీ ఫంక్షన్ తో జ్వాల ఇంట సందడి మొదలైంది. పెళ్లికూతురుగా ముస్తాబైన జ్వాల మెరిసిపోతూ కనిపించింది. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ జంట ఒకటవుతోంది. ఉగాది రోజున తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరో విష్ణు విశాల్..కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. జ్వాలా కూడా తన పేరుతో హైదరాబాద్ లో బ్యాండ్మింటన్ అకాడమీ ప్రారంభించింది. అత్యాధునిక సధుపాయాలతో అకాడమీని రన్ చేస్తోంది. నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో జ్వాలా కనిపించిన సంగతి తెలిసిందే.