బిగ్‌బాస్ 3లోకి రియల్ కపుల్ ఎంట్రీ ఇవ్వనుందా?

మంగళవారం, 2 జులై 2019 (19:41 IST)
బిగ్‌బాస్ 3 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కి సంబంధించి కంటెస్టెంట్ లిస్ట్‌లో ఎవరెవరుంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇదే క్రమంలో బిగ్‌బాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదేమిటంటే.. ఈ సీజన్‌లో ఇద్దరు నిజజీవితంలో కపుల్స్‌ను కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ వితికా శేరులను బిగ్‌బాస్ నిర్వాహకులు కలిసినట్లు సమాచారం. కాగా ఇందులో పాల్గొనేందుకు వారు కూడా ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.
 
హ్యాపీడేస్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వెంటనే వచ్చిన కొత్త బంగారు లోకంతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ, చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. 2016లో వచ్చిన ‘మిస్టర్ 420’తో సినిమాలకు దూరం అయ్యాడు. 
 
మరోవైపు ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పడ్డానండి ప్రేమలో మరీ’ వంటి చిత్రాల్లో నటించిన వితికా సైతం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే వీరిద్దరూ బిగ్‌బాస్ 3తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు