శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే లొకేషన్ల అన్వేషణ, నటీనటుల ఎంపిక పూర్తయింది. ఈ చిత్రంలో హీరో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. రాజకీయనేతగా మారిన కమల్ హాసన్ నటించే చివరి చిత్రం ఇదే. ఈ మేరకు కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరన్నది ఇప్పటికీ సస్సెన్స్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా, అందులో ఒకరు కాజల్ అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈమెకు మేకప్ టెస్ట్ కూడా ఇటీవల అమెరికాలో నిర్వహించారట. సో.. మరో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సివుంది.