ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలితలు పూర్తిగా కనుమరుగైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల సరళి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపై రోజురోజుకూ అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగే, మాటలతో దాడిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరో విశ్వనటుడు ప్రకటించారు. తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో రజనీతో కలిసి పనిచేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ... ఒకవేళ రాజకీయాల్లో రజనీ వస్తే, ఆయనతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తమిళనాడులో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కమల్ పార్టీ రాజకీయ ప్రవేశం చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.